అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజృంభించింది. 409 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన మలేషియా 32.1 ఓవర్లలో కేవలం 93 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీపేశ్ దేవంద్రన్ 5 వికెట్లు తీశాడు. మోహన్ 2, కిషన్, ఖిలాన్, కనిష్క్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత బ్యాటర్ అభిజ్ఞాన్ కుంద్(209) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.