KRNL: ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్లో ఉన్న కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై కేసు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.