కరీంనగర్ నగరంలోని 30వ డివిజన్ కిసాన్ నగర్లో మున్నూరు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మతల్లి బోనాల జాతర జరిగింది. ప్రజల ఆహ్వానం మేరకు నగర మేయర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తితో బోనాలు సమర్పించారు.