NLR: నేటి నుంచి ధనుర్మాసం రావడంతో పండగ నెల ప్రారంభం అయినట్లు ప్రముఖ పండితులు లోకా అనంత వెంకట మురళీధర్ శాస్త్రి తెలిపారు. జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ నిర్వహించనున్నట్లు చెప్పారు. మంచు తెరలు ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. పండుగ నెల ప్రారంభం కావడంతో ప్రతి ఇంటి ముందు రంగవల్లిలతో తీర్చిదిద్దునున్నారు.