AP: కూటమి పాలనపై ప్రజలు విసిగిపోయారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ‘కూటమి ప్రభుత్వం లాభాపేక్ష కోసమే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. నాయకులు స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’ అని పేర్కొన్నారు.