KRNL: ఆదోని జిల్లా మండలాల విభజన అంశంపై టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి, కర్నూలు టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆదోని జేఏసీ సభ్యులు మంగళవారం ఓ నివాసంలో రహస్యంగా సమావేశమయ్యారు. ఆదోని జిల్లా సాధన దిశగా సీఎం చంద్రబాబును కలిసి అంశాన్ని ప్రస్తావించే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు జేఏసీ నాయకులు ఆమ్మద్ నూర్ తెలిపారు.