E.G: జాతీయ ఇంధన వారోత్సవాలు-2025 సందర్భంగా మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యుత్‌ను ప్రకృతి వనరుగా కాకుండా అమూల్యమైన సంపదగా భావించినప్పుడే ఇంధన పొదుపు లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.