ప్రకాశం: బేస్తవారిపేటలో ఐదు నెలలుగా జీతాలు చెల్లించని కారణంగా మంగళవారం పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. వెంటనే తమకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి జీతాలు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన విరమించారు.