CTR: కుప్పం (M) చెక్కునత్తం గ్రామ సమీపంలోని కలిమిగుట్ట వద్ద ఐదు ఏనుగులు తిష్ట వేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడు రాష్ట్రం మహారాజ గడై అడవి ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ప్రస్తుతం చెక్కునత్తం గ్రామ సమీపంలో తిష్ట వేసింది. ఈ ఏనుగులను సింగారపురం వైపు మళ్లించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.