ATP: కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపుగా వాడితే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయన్నారు. గృహోపకరణాలలో మూడు లేదా అంతకంటే ఎక్కువ స్టార్స్ ఉన్న వస్తువులను వినియోగిస్తే విద్యుత్ పొదుపు అవుతుందన్నారు.