MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కింద పేద మహిళలకు ఎల్పీజీ ఉచిత గ్యాస్ కలెక్షన్లను అందజేశారు. నూతన సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ ఆధ్వర్యంలో ఎల్పీజీ కనెక్షన్, స్టవ్, మొదటి రీఫిల్ ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజెపీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.