తన శరీర మార్పులకు ప్లాస్టిక్ సర్జరీ కారణమని ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై నాట్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. నిజాలు తెలుసుకోకుండా కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. సంప్రదాయ వైద్యంతో పాటు మోడ్రన్ సైన్స్‌ను నమ్ముతానని చెప్పింది. కానీ కష్టపడి వ్యాయామం చేసినా బరువు తగ్గొచ్చనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది.