పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో రూ. 80 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ, నాణ్యతను కమిషనర్ ఆధ్వర్యంలో నాణ్యతా ప్రమాణాల కమిటీ పరిశీలన చేసింది. నిర్మించిన రోడ్డు కాంక్రీట్, మెటల్ శాంపిల్స్ సేకరించి క్వాలిటీ కంట్రోల్‌కు పంపించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజినీర్ రత్నా శ్రీను కొలతలను వర్క్ ఇన్స్పెక్టర్లతో తనిఖీ చేశారు.