MBNR: వయస్సు మీద పడి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు మతి భ్రమించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్బర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మైనార్టీ మహిళను హిజాబ్ తీయాలనడం మైనార్టీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.