EG: అనపర్తి కూటమి కార్యాలయం వద్ద అంగన్వాడీలకు ఎమ్మెల్యే నల్లమిల్లి సోమవారం సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. రంగంపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో కృష్ణవేణి మాట్లాడుతూ.. గతంలో 4G ఫోన్లు ఉండడంతో నెట్వర్క్ సమస్యలతో అంగన్వాడీలు ఇబ్బందులు పడేవారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇబ్బందులను తొలగిస్తూ 5G కొత్త ఫోన్లను అంగన్వాడీలకు అందజేసిందని ఎమ్మెల్యే అన్నారు.