ఐపీఎల్-2026 మినీ వేలం రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 350 మంది ఆటగాళ్లను మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ అయిన వారిలో భారత్ నుంచి 16 మంది క్యాప్డ్, 224 అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అలాగే, 110 మంది విదేశీ ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొననున్నారు.