MBNR: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు మూడు దశల ఎన్నికల పూర్తి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోనే కొనసాగుతుందని ఎస్పీ జానకి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగాలంటే ప్రజలు, అభ్యర్థులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు.