బ్యాంకుల్లో, ప్రైవేటు సంస్థల్లో ‘అద్దె లేదా లీజ్’ పేరిట ఇలా బంగారాన్ని అప్పుగా ఇవ్వొచ్చు. దీనిపై ప్రైవేటు సంస్థలు అధిక వడ్డీ ఇస్తుండగా, బ్యాంకుల్లో తక్కువ వడ్డీ లభిస్తుంది. బంగారాన్ని పూచీకత్తుపై లీజ్‌కు ఇస్తే 2% వడ్డీ, పూచీకత్తు లేకుండా ఇస్తే 4% వడ్డీని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. SBI ఏడాదికి 0.50%, రెండేళ్ల వరకు 0.55%, మూడేళ్లకు 0.60% వడ్డీ చెల్లిస్తోంది.