NLR: విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రామతీర్థం గ్రామానికి చెందిన కావలి వెంకట రమణయ్య బైక్పై వెళుతుండగా ఓ మినీ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.