SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికలు పూర్తి అయిన పోలింగ్ కేంద్రాల నుంచి ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి ఆదివారం రాత్రి చేరుకుంది. తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిసెప్షన్ కేంద్రానికి సామగ్రి, అధికారులు, సిబ్బంది చేరుకోగా, ఈ సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ పరిశీలించారు.