జగిత్యాల రూరల్ మండలంలోని అనంతారం గ్రామ సర్పంచ్‌గా బత్తిని రవీన మహేష్ తన సమీప అభ్యర్థిపై స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రామంలో అభిమానులు, గ్రామ నాయకులు సంబరాలు నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ.. గ్రామ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు.