W.G: వయస్సుకు మించిన జ్ఞాపకశక్తితో తణుకు మండలం ముద్దాపురానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. మహాభారతం, వినాయకుని చరిత్ర వంటి ఇతిహాసాలను, ఆధ్యాత్మిక విషయాలను చిన్నారి అనర్హళంగా చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కుమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు గోవర్ధన్, అనూష ఆమెను ప్రోత్సహించినట్లు తెలిపారు.