TG: జగిత్యాల జిల్లా ఉప్పుమడుగు సర్పంచ్‌గా కొత్తకొండ రోజా 140 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే, గ్రామంలో 6వ వార్డుకు నామినేషన్లు రాకపోవడంతో రోజా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు వార్డు సభ్యురాలిగా, ఇటు సర్పంచ్‌గా ఎన్నికై రోజా డబుల్ విక్టరీ సాధించారు. వార్డు సభ్యురాలి పదవికి ఆమె రాజీనామా చేయనున్నారు.