కృష్ణా: వందే భారత్ రైలు సేవలు ఈరోజు గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గుడివాడలో కూడా ఆగనుంది. చెన్నై-విజయవాడ వందే భారత్ రైలును నర్సాపురం వరకు రైల్వే శాఖ పొడిగించింది. అయితే నర్సాపూర్, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్, బెంగళూరుకు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.