VSP: జీవీఎంసీ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా సోమవారం అన్ని జోన్లలో కలిపి మొత్తం 402 ఆక్రమణలను తొలగించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-6 పరిధిలో అత్యధికంగా 128 ఆక్రమణలు తొలగించారు. ఫుట్‌పాత్‌లపై నడక సాగించేందుకు, రోడ్లు, జంక్షన్లలో రాకపోకలకు అడ్డంకులు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు.