MLG: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భాగంగా చేపట్టిన పనులను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. పార్కింగ్, భద్రత ఏర్పాట్లు అభివృద్ధి పనుల్లో జరుగుతున్న తీరును పరిశీలించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఆలయ విస్తరణ పనులు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.