PPM: పీఎం జుగా పథకంలో భాగంగా కొమరాడ మండలంలో పలు ఏజన్సీ గిరిజన గ్రామాల్లో నూతన విద్యుత్ లైన్లను వేస్తున్నారు. ఆదివారం మండలంలో పిల్లిగుడ్డివలస గ్రామంలో నూతన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా అందజేస్తున్నామని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. తమ గ్రామానికి నూతన విద్యుత్ లైన్లు వేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.