VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో నేరాలు నియంత్రణలో భాగంగా పట్టణంలో ముందుగా గుర్తించిన 80 ప్రాంతాలను ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారి భద్రతల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. వాహన పత్రాలు లేనివారిపై కేసులు నమోదుచేశామన్నారు. ఈ తనిఖీల్లో నలుగురు డీఎస్పీలు,12 మంది సీఐలు, 33 మంది ఎస్సైలు, 350 సిబ్బంది పాల్గొన్నారు.