MLG: లక్ష్మీదేవిపేట వార్డు సభ్యునిగా గెలిచిన కడివెండి తిరుపతి, సర్వాపురం వార్డు సభ్యునిగా గెలిచిన ఎర్రోజు నరేష్‌లను విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా రాణించాలని సంఘం అధ్యక్షుడు కడివెండి వీరాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలుకతుర్తి రాజన్న నరసింహచారి, శ్రీనివాస్, శ్రీధర్, జ్ఞానేశ్, దేవేందర్ పాల్గొన్నారు.