VKB: ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి మూడో విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పరిగి ఎస్సై మోహన్ కృష్ణ తెలిపారు. గుంపులుగా ప్రజలు నిలబడకూడదని, ప్రచారాలు, ర్యాలీలు చేయవద్దని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచార వీడియోలు పోస్టు చేసి ఓటర్ను ప్రలోభాలకు గురి చేయవద్దని అన్నారు. ఆంక్షలను అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.