BHPL: జిల్లా SP కార్యాలయంలో ఇవాళ SP సిరిశెట్టి సంకీర్త్ మీడియాతో మాట్లాడారు. DEC 17న మహదేవపూర్, కాటారం, మహాముత్తారం మండలాల్లో జరిగే మూడో విడత ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.