NLG: చిట్యాల-నేరడ బీటీ రోడ్డు కంకర తేలి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా విస్తరణ పనులు పూర్తి కాకుండా నిలిచిపోయాయి. సింగల్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. అయిన కొద్ది రోజుల్లో యథావిధిగా మారిపోతుంది. దీనికి తోడు రైతులు పైపులైన్ వేయడానికి రోడ్డును అడ్డంగా తవ్వుతున్నారు. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది.