వచ్చే ఏడాది జనవరి నుంచి టీవీల ధరలు పెరగనున్నాయి. మెమోరీ చిప్‌ల ధర పెరగడం, రూపాయి విలువ తగ్గి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.90 దాటిన కారణంగా.. టీవీల ధరలు జనవరి నుంచి 3-4 శాతం పెరుగనున్నాయి. ఇటీవల టీవీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల వినియోగదారుడికి కలిగిన ప్రయోజనం ఈ చిప్‌ల సంక్షోభం మింగేస్తున్నదని టీవీల డీలర్ పేర్కొన్నారు.