ELR: గ్రామాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా ఐక్యవేదిక నాయకులు కృషి చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ తెంటు అప్పారావు పేర్కొన్నారు. మండవల్లిలో ఆదివారం రాత్రి మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం గురించి అవగాహన కల్పించేలా సభలు నిర్వహించాలని సూచించారు.