CTR: కుప్పం (M) కొట్టాలూరు పంచాయతీ ఎర్రమన్ను గుంతలు సమీపంలో నాటు బాంబు పేలి చిన్న చిన్న తంబి (38) తీవ్రంగా గాయపడ్డాడు. చిన్న తంబి శరీరం ఓవైపు పూర్తిగా కాలిపోవడంతో అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. చిన్న తంబి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కుప్పం పోలీసులు విచారణ చేపట్టారు.