SDAT వరల్డ్ కప్ 2025లో భారత స్క్వాష్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి విశ్వవిజేతగా నిలిచి టైటిల్ గెలిచింది. జోష్నా చిన్నప్ప, అభయ్ సింగ్, వేలవన్, అనాహత్ సింగ్ల పోరాటాన్ని ప్రధాని మోదీ ఆకాశానికెత్తారు. వారి అంకితభావం దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం యువతలో స్క్వాష్పై ఆసక్తిని పెంచుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.