KNR: స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా వేసిన అండర్ డ్రైనేజీ చాంబర్లతో రోడ్లు ధ్వంసం కావడంతో, కిసాన్‌నగర్ 3వ డివిజన్ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పగుళ్లు, నిలిచిన మురుగు నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు కాలనీవాసుల తరఫున దళిత మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్ వినూత్న నిరసన చేపట్టారు.