CTR: పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు అనుసరణీయమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో అమరజీవులు శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరులయ్యారని పేర్కొన్నారు.