సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. తాజాగా ఈ సినిమాపై క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో మహేష్ తండ్రి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో కూడా మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన విషయం తెలిసిందే.