గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు బిల్లు ప్రతులను కేంద్రం లోక్సభలో సభ్యులకు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గ్రామీణ ఉపాధికి ప్రత్యామ్నాయ పథకాన్ని కూడా తెరపైకి తీసుకురానున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన’గా మార్చింది. పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది.