CTR: ఇంద్ర ఏసీ బస్సు ఛార్జీలు తగ్గించినట్లు పుంగనూరు ఆర్టీసీ డిపో డీఎం దినేష్ తెలిపారు. పుంగనూరు నుంచి విజయవాడకు వెళ్లే ఇంద్ర బస్సులో శీతాకాలం దృష్ట్యా 10% ఛార్జీ తగ్గించినట్లు చెప్పారు. రేపటి నుంచి అమలవుతుందని తెలిపారు. పాత ఛార్జీ 1,280, కొత్త ఛార్జీ1,165.పుంగనూరు- మదనపల్లి – తిరుపతి మీదుగా విజయవాడకు ఈ బస్సు చేరుకుంటుందని అన్నారు.