గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించిన రెండు సంవత్సరాల్లో 118.78 కోట్ల మంది ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా ఆక్యుపెన్సీ రేషియో 70 నుంచి 105 శాతానికి పెరిగింది. పండగలు, వివిధ ప్రత్యేక సందర్భాల్లో మహిళలకు ఉచిత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతుంది.