CTR: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న ఛలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘం విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.