ATP: తాడిపత్రి పట్టణంలో ధనుర్మాసం సందర్భంగా ఇంటింటికీ తిరుప్పావై కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. శ్రీ ఆండాళ్ అనుసరించిన తిరుప్పావై సేవా గోష్టి మొదటి రోజు కంబగిరి జూవెలర్స్ జైనీ లక్ష్మీనారాయణ గృహంలో పూజలు నిర్వహించారు. అర్చకులు చింతల రాయన్, శ్రీనివాస్ దేశికన్ లు ఉత్సవ మూర్తులను ఉంచి, అత్యంత భక్తిశ్రద్ధల నడుమ విశేష పూజలు నిర్వహించారు.