ADB: మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నేరడిగొండ మండల కేంద్రంలో వార్డు మెంబర్ అభ్యర్థికి అనుకూలంగా డబ్బులు పంచుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. షేక్ కైఫ్ పాషా, షేక్ జాకిఉల్లా వద్ద నుంచి రూ. 30,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.