SRCL: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధులు వికలాంగులకు పోలీసులు బాసటగా నిలుస్తున్నారు. పోలింగ్ కేంద్రం వరకు అభ్యర్థులు వివిధ వాహనాల్లో ఓటర్లను వృద్ధులు, వికలాంగులను తరలిస్తున్నారు.