MDK: చేపల వేటకు వెళ్ళిన ఒక మత్స్య కార్మికుడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన రామాయంపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మున్సిపాలిటీ పరిధిలోని గొలిపర్తి గ్రామంలో నివాసముండే తొంటవాలి సిద్ధరాములు అనే మత్స్య కారుడు మంగళవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతయ్యారు. బుధవారం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.