KMR: మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్నూర్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓటర్లు ఎటువంటి భయం లేకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.