NRML: జాతీయ పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో పెన్షనర్లు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న కోరారు. నిర్మల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నో పీఆర్సీ-నో డీఏ’పై సంతకాల సేకరణ చేపట్టి ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. స్థానిక సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి చేస్తామని కూడా పేర్కొన్నారు.