పెద్దపల్లిజిల్లాలో మూడవ విడత సర్పంచ్ ఎన్నికల కోసం జిల్లాలో 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 144సెక్షన్ అమలులో ఉంటుందని, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విడతలో 6 మండలాలలో మొత్తం119 గ్రామా పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.